బస్తర్ నుంచి కేంద్ర బలగాలు వెనక్కి.. 2027 మార్చి 31 కీలక డెడ్లైన్ : చతిస్గడ్ డిప్యూటీ సీఎం
చతిస్గడ్, 11 మార్చి (హి.స.) 2027 మార్చి 31 నాటికి ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో నుంచి మెజారిటీ పారామిలటరీ బలగాలను ఉపసంహరించుకునే అవకాశం ఉందని చతిస్గడ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ చర్చల సంద
చతిస్గడ్


చతిస్గడ్, 11 మార్చి (హి.స.)

2027 మార్చి 31 నాటికి ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో నుంచి మెజారిటీ పారామిలటరీ బలగాలను ఉపసంహరించుకునే అవకాశం ఉందని చతిస్గడ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ చర్చల సందర్భంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు. సాయుధ మావోయిజాన్ని అంతం చేయడానికి 2026 మార్చి 31 ని తుది గడువుగా కేంద్రం నిర్ణయించిందని గుర్తుకు చేశారు.

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రత్యేక బడ్జెట్..

'2027 మార్చి 31 నాటికి కేంద్ర బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పరిస్థితులను బట్టి కొన్ని బలగాలు అంతకంటే ముందే వెనుతిరగవచ్చు. చివరికి బస్తర్ నుంచి అన్ని కేంద్ర బలగాలు వెళ్లిపోతాయి' అని విజయ్ శర్మ పేర్కొన్నారు. కాగా, పోలీస్ శాఖ కోసం ఈ సారి బడ్జెట్లో మొత్తం రూ. 7,721.01 కోట్లు కేటాయించారు. ఇందులో రెవెన్యూ వ్యయం కింద రూ.7,130.48 కోట్లు, మూలధన వ్యయం కింద .590.53 కోట్లు ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల కోసం కేంద్ర పునరావాస విధానం కింద ఫిక్స్డ్ డిపాజిట్లు, వృత్తి విద్యా శిక్షణ కోసం రూ.38 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు.

కేవలం 21 రోజులే సమయం..

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ ఈ అంశంపై స్పందిస్తూ.. బస్తర్లో శాంతి నెలకొనాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 2026 మార్చి 31 గడువుకు ఇంకా కేవలం 21 రోజులే సమయం ఉందని (సభ నాటి గడువును ఉద్దేశించి), ఆ తర్వాత బలగాల ఉపసంహరణ మొదలవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మావోయిజం అంతం కావడాన్ని పురస్కరించుకుని మార్చి 313 అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. బస్తర్ ప్రాంత అభివృద్ధి, అక్కడి వనరుల ప్రయోజనం స్థానిక ప్రజలకే దక్కాలని బఘేల్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande