హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచానికి ముప్పు: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక!
న్యూఢిల్లీ, 11 మార్చి (హి.స.) పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ఎక్కువకాలం పాటు మూతపడితే ప్రపంచ వాణిజ్యం, అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటాయని ఐక్యరాజ్యసమితి (United Nations) హెచ్చరించింది. దీనివల్ల ప
UNO


న్యూఢిల్లీ, 11 మార్చి (హి.స.)

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న

ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ఎక్కువకాలం పాటు మూతపడితే ప్రపంచ వాణిజ్యం, అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటాయని ఐక్యరాజ్యసమితి (United Nations) హెచ్చరించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు పెరగడమే కాకుండా జీవన వ్యయం(Cost of Living) భారమవుతుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి సంస్థ (UNCTAD) మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ప్రతిగా ఇరాన్ ప్రతీకార చర్యల వల్ల హోర్ముజ్ జలసంధి ద్వారా జరగాల్సిన రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఫిబ్రవరి 28న దాడులు మొదలైనప్పటి నుండి ఈ మార్గంలో ఓడల రాకపోకలు 97 శాతం పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గం ద్వారా జరిగే చమురు రవాణాలో నాలుగో వంతు (25%) ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. 2024 గణాంకాల ప్రకారం.. రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ మార్గం గుండా వెళ్తుంది.

చమురు సరఫరా దాదాపు పడిపోవడంతో దాని ఎఫెక్ట్ గ్యాస్ సిలిండర్లపై పడింది. గ్యాస్ ధరలు, ఎరువుల ధరలు, చమురు ధరలు పెరిగితే ఆహార ధరలు పెరుగుతాయని UNCTAD వివరించింది. ముఖ్యంగా పేద దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ మార్గం ద్వారా రవాణా అయ్యే చమురులో 84 శాతం ఎల్ఎన్జ (LNG) గ్యాస్లో 83 శాతం ఆసియా దేశాలకే వెళ్తుంది. జలసంధి మూసివేత వల్ల ఆసియాలో ఇంధన సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande