
అమరావతి, 11 మార్చి (హి.స.)
రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డులో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ అగ్ని ప్రమాదం.. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరపాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాగా సమీప పోలంలో నుంచి మంటలు వచ్చాయని ఎల్ అండ్ టీ ప్రతినిధులు వెల్లడించారు. పోలం నుంచి పైపుల వరకు గడ్డి పేర్చి.. పైపులకు నిప్పు పెట్టినట్లు అనవాళ్లు ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రమాద ఘటన స్థలానికి ఫోరెన్సిక్ బృందం ఇప్పటికే చేరుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ