ఘోర ప్రమాదం: తగలబడిన ఆర్టీసీ బస్సు.. ఆరుగురు మృతి
బెర్న్, 11 మార్చి (హి.స.) స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రాంతీయ రవాణా బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కనీసం ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిల
/switzerland-bus-fire-6-killed-and-3-critically-injured-in-k


బెర్న్, 11 మార్చి (హి.స.)

స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రాంతీయ రవాణా బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కనీసం ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాజధాని బెర్న్ నగరానికి పశ్చిమాన సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెర్జర్స్ (Kerzers) అనే పట్టణంలో ఈ విషాదం జరిగింది. స్విస్ జాతీయ పోస్టల్ సర్వీస్కు అనుబంధంగా నడిచే పోస్ట్బస్ (PostBus) సంస్థకు చెందిన ప్రాంతీయ బస్సులో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.

మంటలు చెలరేగిన వెంటనే సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే అప్పటికే బస్సు పూర్తిగా అగ్నికీలల్లో చిక్కుకుపోయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే.. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కాకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై ఫ్రిబోర్గ్ కాంటన్ పోలీసు ప్రతినిధి ఫ్రెడరిక్ పాపాక్స్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదం ఎవరైనా కావాలని చేసింది అయిఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనిని కుట్రకోణంలో కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా (హెలికాప్టర్లలో) సమీపంలోని ఆసుపత్రులకు తరలించామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande