ప్రధాన ఎన్నికల కమిషనర్ను పదవి నుంచి తొలగించాల
డిల్లీ, 13 మార్చి (హి.స.)దేశ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు అధికారికంగా నోటీసు ఇచ్చాయి. ప్రతిపక్షం ఇచ్చిన నోటీసుపై 190 మంది ఎంపీలు సంతకం చేశారు. నోటీసును లోక్‌సభ
Cec


డిల్లీ, 13 మార్చి (హి.స.)దేశ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు అధికారికంగా నోటీసు ఇచ్చాయి. ప్రతిపక్షం ఇచ్చిన నోటీసుపై 190 మంది ఎంపీలు సంతకం చేశారు. నోటీసును లోక్‌సభ మరియు రాజ్యసభ రెండింటిలోనూ సమర్పించారు. ఎన్నికల నిర్వహణలో తటస్థత పాటించలేదని, కొన్ని నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగినట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.

ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయని, వాటిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. అందువల్ల ఆయన్ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌తో నోటీసు సమర్పించినట్లు వెల్లడించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande