మాజీ డీజీపీ HJ దొర గారి మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి సంతాప సందేశం
హైదరాబాద్, 13 మార్చి (హి.స.) మాజీ డీజీపీ శ్రీ HJ దొర గారి మరణ వార్త తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా వారు చేసిన సేవలు, శాంతిభద్రతలను కాపాడటంలో నీతి, నిజాయితీ, నిబద్ధత, పరిపాలనా సామర్థ్యం ఎప్పటికీ గుర్తుండిపోతాయి
మాజీ డీజీపీ HJ దొర గారి మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి సంతాప సందేశం*


హైదరాబాద్, 13 మార్చి (హి.స.)

మాజీ డీజీపీ శ్రీ HJ దొర గారి మరణ వార్త తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా వారు చేసిన సేవలు, శాంతిభద్రతలను కాపాడటంలో నీతి, నిజాయితీ, నిబద్ధత, పరిపాలనా సామర్థ్యం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జాతీయ స్థాయిలో కేంద్రంలోనూ CISF డైరెక్టర్‌గా వారు సేవలందించారు.

ప్రత్యేకంగా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా ఆశ్రమానికి శ్రీ దొరగారు చేసిన సేవలు చిరస్మరణీయం. రిటైర్మెంట్ అనంతరం కూడా పోలీసు వ్యవస్థలో సంస్కరణలకోసం వారు సేవలందించారు. హెచ్HJ దొర గారి మృతి పోలీస్ రంగానికి తీరనిలోటు.

వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, శ్రీ దొర గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande