పాకిస్థాన్ ప్లేయర్ కొనుగోలు ఎఫెక్ట్.. సన్రైజర్స్ లీడ్స్ ‘ఎక్స్’ అకౌంట్ సస్పెండ్!
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది.
IPL


హైదరాబాద్, 13 మార్చి (హి.స.)మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని టీమ్లు మ్యాచ్లకు సంసిద్ధమవుతున్నాయి. ఈ సారి ఎస్ఆర్హెచ్ ఎలాగైన కప్పు కొట్టాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సన్రైజర్స్ ఫ్రాంచైజీపై అనేక విమర్శలు వచ్చాయి. కావ్యా మారన్పై ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే.. ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ‘ది హండ్రెడ్’ (The Hundred 2026) ప్లేయర్ల వేలం పాటలో పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ అనుబంధ జట్టు అయిన సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేసింది. అబ్రార్ను ఏకంగా 1.90 లక్షల పౌండ్లకు (సుమారు ₹2.34 కోట్లు) దక్కించుకుంది. భారత యాజమాన్యం కలిగిన ఈ జట్టు పాక్ ఆటగాడిని కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను బహిష్కరించాలని.. ఫ్రాంచైజ్, సహ యజమాని కావ్యా మారన్ ఇద్దరూ తీవ్ర విమర్శలకు గురయ్యారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై, యజమాని కావ్యా మారన్పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ‘బాయ్కాట్ సన్రైజర్స్ హైదరాబాద్’ (#BoycottSRH) హ్యాష్ట్యాగ్ వైరల్గా మారింది. ఇంతలో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ వివాదం మధ్య సన్రైజర్స్ లీడ్స్ ఖాతా సస్పెన్సన్కు గురవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అకౌంట్ను ఓపెన్ చేస్తే.. “ఎక్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతా సస్పెండ్ చేయబడింది” అనే సందేశం వినియోగదారులకు కనిపిస్తోంది. ఈ అంశంపై మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ సస్పెన్షన్కు, అబ్రార్ అహ్మద్ కొనుగోలుకు గల సంబంధంపై ఎక్స్ యాజమాన్యం సైతం సరైన వివరణ ఇవ్వలేదు. దీంతో ఈ టాపిక్ కాస్త మరింత హాట్ హాట్గా మారింది. కాగా.. ప్రస్తుతం సన్రైజర్స్ యాజమాన్యం (సన్ గ్రూప్) ఇంగ్లాండ్లోని ‘ది హండ్రెడ్’ లీగ్లో సన్రైజర్స్ లీడ్స్ (గతంలో నార్తర్న్ సూపర్చార్జర్స్) పేరుతో కొత్త ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande