ఆంధ్రప్రదేశ్ లో. మరోసారి పెద్దపులి సంచారం
కాకినాడ, 13 మార్చి (హి.స.) , :ఆంధ్రప్రదేశ్లో మరోసారి పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళన రేపుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కదలిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో పెద్దపులి సంచరిస్
ఆంధ్రప్రదేశ్ లో. మరోసారి పెద్దపులి సంచారం


కాకినాడ, 13 మార్చి (హి.స.)

, :ఆంధ్రప్రదేశ్లో మరోసారి పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళన రేపుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కదలిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలుసుకొని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మండల పరిధిలోని గౌరవంపేట పంచాయతీ, రాజవరం - మాసంపల్లి గ్రామాల మధ్య ఉన్న సరుగుడు తోటల్లో పెద్దపులి కదలికలను గుర్తించడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande