
అమరావతి, 13 మార్చి (హి.స.)
ఎన్టీఆర్ జిల్లా, :ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం మండలం దేవునిచెరువు ప్రభుత్వ పాఠశాలలో గత మూడు నెలలుగా నాణ్యతలేని మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. భోజనం నాణ్యతగా లేదని విద్యార్థులు డస్ట్బిన్లో పారబోశారు.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్(AP Minister Nara Lokesh)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత తక్కువగా ఉందనే సమాచారం వచ్చిందని.. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ