డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం: ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్, 13 మార్చి (హి.స.) ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపై అధికారులు స్పెషల్ డ్రైవ్తో చెక్ పెడుతున్నారు. ''ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'' 99 రోజులలో భాగంగా గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతోంది. ఇందు కోసం ప్రత్యేక బృందాలను నియ
Excise


హైదరాబాద్, 13 మార్చి (హి.స.)

ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపై అధికారులు స్పెషల్ డ్రైవ్తో చెక్ పెడుతున్నారు. 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' 99 రోజులలో భాగంగా గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతోంది. ఇందు కోసం ప్రత్యేక బృందాలను నియమించారు.

ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోని నాలుగు ఎస్టీఎఫ్ టీమ్లు, ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు, జిల్లా స్థాయిలో డీటీఎఫ్ టీమ్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్, గంజాయి, ఎన్డీపీఎల్ అమ్మకాలపై నిఘా పెట్టడానికి కొన్ని హాట్ స్పాట్స్ను ఎంపిక చేశారు. ధూళిపేట్, నారాయణగూడ, ఫతేనగర్, సీతాఫల్మండి, నేరేడ్మేట్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, మూసాపేట్, దిల్స్నుక్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, అన్నోజిగూడ, నాగోల్ ముగూరు బస్తీలను గుర్తించారు. వీటితో పాటు రైళ్ల తనిఖీలు, చెక్ పోస్టు వద్ద నిఘా పెంచడం చేస్తున్నారు.

ఢిల్లీ, నోయిడా, గోవా, హర్యానా, ప్రాంతాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎక్కువగా వస్తున్నట్లు ఎక్సైజ్శాఖ గుర్తించింది. ఎయిర్పోర్టు, రైళ్లలోను, చెక్ పోస్టుల నుంచి వస్తున్న ఎన్డీపీఎల్ మద్యాన్ని అరికట్టడానికి స్పెషల్ డ్రైవ్స్ చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1,251 కేసుల్లో 16,103 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande