
సూరత్, 19 మార్చి (హి.స.)
గుజరాత్లోని సూరత్ నగరంలో
గురువారం తెల్లవారుజామున ఒక భయంకరమైన అగ్నిప్రమాదం (Major fire accident) చోటుచేసుకుంది. కాపోద్రా ప్రాంతంలోని భరత్ నగర్ వద్ద ఉన్న ఒక మూడు అంతస్తుల ఎంబ్రాయిడరీ యూనిట్ (Embroidery unit)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మంటల ధాటికి భవనంలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ ఘటనలో మరో 9 మంది తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో భవనం మూడో అంతస్తులో మంటలు మొదలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే రెండు సిలిండర్లు పేలిపోయి మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. భవనం లోపల చిక్కుకుపోయిన 11 మంది కార్మికులను కాపాడేందుకు ఫైర్ సిబ్బంది హైడ్రాలిక్ ప్లాట్ఫారమ్ను ఉపయోగించి.. పైకప్పు రేకులను తొలగించి వారిని సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. భవనంలో మొత్తం 8 సిలిండర్లు ఉండగా, మరో 6 సిలిండర్లను బయటకు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు మీడియాకు ఈ ప్రమాదంపై కేసు నమోదు తెలిపారు. కాగా చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..