
ముంబై, 19 మార్చి (హి.స.)
మరాఠీ నూతన సంవత్సరమైన
'గుడి పడ్వా' వేడుకలను మహారాష్ట్ర ప్రజలు గురువారం అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ముంబై, నాగ్పూర్ తదితర ప్రాంతాల్లో ఈ పండుగ వాతావరణం అంబరాన్నంటింది. ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరించి, సాంస్కృతిక ప్రదర్శనలతో నూతన సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు.
ముంబైలో జరిగిన గుడి పడ్వా శోభాయాత్రలో సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యేకంగా మహిళలు నిర్వహించిన బైక్ ర్యాలీ కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ ర్యాలీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. గుడి పడ్వా పర్వదినాన్ని పురస్కరించుకుని నాగ్పూర్లో భారీ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొని సందడి చేశారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ఈ వేడుకల్లో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. గుడి పడ్వా పర్వదినం ముందు రోజు రాత్రి, ముంబైలోని ప్రసిద్ధ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..