
హైదరాబాద్, 02 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. తెలంగాణ పౌరుల సహాయం కోసం సీఎం రేవంత్ ఆదేశాల మేరకు దీన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విదేశాంగశాఖ, సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో తెలంగాణ భవన్ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న రాష్ట్ర పౌరులకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని అధికారులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్