
హైదరాబాద్, 02 మార్చి (హి.స.)ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొస్తామని చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి, ఏపీఎన్నార్టీఎస్ అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అందుకోసం చర్యలు ఇప్పటికే చేపట్టామన్నారు.
సోమవారం అమరావతిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారికి ఏపీఎన్నార్టీఎస్ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అలాగే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్లు వినియోగించుకోవాలంటూ గల్ఫ్లో చిక్కుకున్న వారికి ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి సూచించారు.
తమ సమస్యలు.. ఏపీఎన్నార్టీఎస్ హెల్ప్లైన్ నెంబర్ 0863-2340678కు చెప్పొచ్చని తెలిపారు. ఈ నెంబర్ వారంలో ఏడు రోజులు.. 24 గంటలు సైతం పని చేస్తుందని పేర్కొన్నారు. అలాగే వాట్సాప్ నంబర్ +91 85000 27678 సమస్యలు చెప్పొచ్చంటూ గల్ఫ్లో చిక్కుకున్న వారికి వివరించారు. ఇక ఈ-మెయిల్: hepline@apnrts.comను సంప్రదించవచ్చు వారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్