హైడ్రా పేరిట పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు: బండి సంజయ్
హైదరాబాద్, 02 మార్చి (హి.స.)హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఇటీవల బాన్సువాడలో జరిగిన ఘటన దురదృష్టకరమని చెప్పారు. కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా పేర
Bandi


హైదరాబాద్, 02 మార్చి (హి.స.)హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఇటీవల బాన్సువాడలో జరిగిన ఘటన దురదృష్టకరమని చెప్పారు. కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

హైడ్రా పేరుతో పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. పెద్దలతో బేరసారాలు కుదుర్చుకుని వారి జోలికి వెళ్లడం లేదన్నారు. మూసీ ఒడ్డున గాంధీ విగ్రహం పేరిట, ఖమ్మంలోని భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫర్ జోన్లో ఎన్ని ఇళ్లున్నాయి? ఎన్ని కూల్చారు? అనే దానిపై చర్చకు సిద్ధమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande