ఏపి మద్యం కేసు నిందితుడు అవినాష్ రెడ్డి కి రెగులర్ బెయిల్ మంజూరు
అమరావతి, 20 మార్చి (హి.స.) న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టులో(Supreme Court) ఊరట లభించింది. అవినాశ్కు సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఏ-
ఏపి మద్యం కేసు  నిందితుడు అవినాష్ రెడ్డి కి రెగులర్ బెయిల్ మంజూరు


అమరావతి, 20 మార్చి (హి.స.)

న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టులో(Supreme Court) ఊరట లభించింది. అవినాశ్కు సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఏ-7గా ఉన్న అవినాశ్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. కోర్టు అనుమతితో జరిగిన ఈ విచారణలో అవినాశ్ కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం.

మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్ర, అంతిమ లబ్ధిదారుడికి సంబంధించిన విషయాలపై అవినాశ్ రెడ్డి వివరాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్లో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉండగా, అవినాశ్ రెడ్డి ఆర్థిక నియంత్రణ, లావాదేవీలలో ముఖ్యపాత్ర వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande