
హైదరాబాద్, 20 మార్చి (హి.స.)గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దిగుమతి తగ్గింది.. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధర 2 రూపాయల 26 పైసలు పెరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ లేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ అంశంపై తెలంగాణా పెట్రోలియం డీలర్స్ ప్రెసిడెంట్ అమరేందర్‌రెడ్డి మాట్లాడారు. ఈ రోజు ఉదయం పవర్ పెట్రోల్ పై 2 రూపాయల 26 పైసలు ధర పెరిగిందని వెల్లడించారు.. ఇంచుమించు నార్మల్ పెట్రోల్, డీజిల్ కూడా ధర పెరిగే అవకాశం కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంత పెరుగుతుంది అనేది మాకు ఎలాంటి సమాచారం లేదన్నారు.. డాలర్ రేటు పెరిగింది, బ్యారేల్ ధర కూడా పెరిగి ప్రభుత్వంపైన భారం పడే అవకాశం ఉందన్నారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు