ఎన్నడు లేని విధంగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
ముంబై, 23 మార్చి (హి.స.)ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో దిగి వస్తున్నాయి. గత శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 3.5% తగ్గి ఔన్సుకు $4,488కి చేరింది. 1983 తర్వాత వారంలో ఇంత భారీ తగ్గుదల నమోదు కావడం.. ప్రస్తుతం మహిళలకు పండగే అని చ
Gold


ముంబై, 23 మార్చి (హి.స.)ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో దిగి వస్తున్నాయి. గత శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 3.5% తగ్గి ఔన్సుకు $4,488కి చేరింది. 1983 తర్వాత వారంలో ఇంత భారీ తగ్గుదల నమోదు కావడం..

ప్రస్తుతం మహిళలకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నడు లేని విధంగా ఊహించని స్థాయిలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. ఒకప్పుడు రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన ఈ రెండు లోహాలు ఇప్పుడు అదే రికార్డు స్థాయిలో పతనం అవుతున్నాయి.

గత వారం భారత బులియన్ మార్కెట్కు అత్యంత విపత్కరమైనదిగా నిలిచింది. బంగారం, వెండి ధరలు దశాబ్దాలలోనే అతిపెద్ద పతనాన్ని నమోదు చేశాయి. బలపడుతున్న ప్రపంచ డాలర్, అధిక వడ్డీ రేట్ల భయాలు బంగారం ధరలను కిలోకు రూ.1.45 లక్షలకు, వెండి ధరలను కిలోకు రూ. 2.45 లక్షలకు నెట్టాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,960 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,790 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,110 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,940 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,960 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,790 వద్ద కొనసాగుతోంది.

విజయవడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,960 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,790 వద్ద కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande