సీఎస్కే ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి గాయం
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయం కారణంగా టోర్నీ మొదటి 2 వారాల పాటు ఆటకు దూరం కానున్నారు.
Cricketer Dhoni


హైదరాబాద్, 28 మార్చి (హి.స.)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయం కారణంగా టోర్నీ మొదటి 2 వారాల పాటు ఆటకు దూరం కానున్నారు. ఈ విషయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో ధోనీ పిక్క కండరాల గాయానికి (Calf Strain) గురైనట్లుగా సమాచారం. దీంతో ఆయన కనీసం 2 పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ధోనీ ఐపీఎల్ 2026 మొదటి వారాల 2వారాల మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో 'గెట్ వెల్ సూన్ తలా' అంటూ సోషల్ మీడియా వేదికగా సీఎస్కే పోస్ట్ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande