
నాగర్ కర్నూల్, 30 మార్చి (హి.స.)
ఓ వ్యక్తి నుంచి రూ.20వేలు లంచం
తీసుకుంటూ ఎస్సై పట్టుబడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక కేసుకు సంబంధించి ఈనెల 07న ఒక వ్యక్తి వద్ద నుంచి రూ. 30 వేలు డిమాండ్ చేసి రూ. 20వేలు లంచం తీసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి నీ సోమవారం మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఇసుక కొడుతున్న ఓ వ్యక్తికి సంబంధించిన ట్రాక్టర్, జేసీబీని పట్టుకొని ఈనెల 5వ తేదీన ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి కేసు నమోదు చేసి వివరాలను నాగర్ కర్నూల్ జిల్లా మైనింగ్ అధికారులకు తెలిపారు. మైనింగ్ అధికారులు ఆ వాహనాలకు రూ.60 వేలు ఫైన్ వేశారు. ఈ డబ్బులను ఈనెల 7వ తేదీన చెల్లించి వాహనాల రిలీజ్ కోసం పత్రాలను తెచ్చి ఎస్సైకి ఇచ్చాడు. రూ.30 వేలు ఇస్తేనే వాహనాలను విడుదల చేస్తాను అని ఎస్సై చెప్పాడు. మైనింగ్ ఫైన్ కట్టడంతో పాటు.. మళ్లీ రూ.30 వేలు కట్టవలసి రావడంతో వాయిస్ రికార్డింగ్ లు.. 20వేల రూపాయలు చెల్లించిన అంశాలతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అన్ని ఆధారాలతో ఏసీబీ అధికారులు సోమవారం పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు DSP బాలకృష్ణ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు