
హైదరాబాద్, 30 మార్చి (హి.స.)
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు
హింసా మార్గాన్ని విడనాడి, జనజీవన స్రవంతిలో కలిసి గౌరవప్రదమైన జీవితం కొనసాగించాలని తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్లైన్ మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టు అగ్రనేత గణపతి (Ganapati) అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు ఆరోగ్యం క్షీణించిందని తమకు సమాచారం ఉందని వెల్లడించారు. 'గణపతి గారు వెంటనే లొంగిపోవాలి. ఆయన లొంగిపోతే ప్రభుత్వ ఖర్చులతోనే పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యం అందిస్తాం'అని భరోసానిచ్చారు. గణపతితో పాటు అజ్ఞాతంలో ఉన్న మరో ఏడుగురు ముఖ్య నేతలు కూడా వెంటనే లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు