
అమరావతి, 31 మార్చి (హి.స.)
పోలవరం పనులపై పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం పడింది. ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్కు అవసరమైన బండరాళ్ల కోసం పక్కనే ఉన్న కొండల నుంచి రాయిని తొలిచేందుకు అవసరమయ్యే అమ్మోనియం నైట్రేట్ గల్ఫ్ నుంచి రావాల్సి ఉంది. ఇటీవల జరిగిన బ్లాస్టింగ్లకు వాడేయడంతో అమ్మోనియం నైట్రేట్ కొరత ఏర్పడింది. దీంతో 30 శాతం మేర బ్లాస్టింగ్ తగ్గిందని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు నిర్ణీత కాలవ్యవధిలోనే సమాంతర డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతున్నాయని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెప్పినట్లుగానే గడువులోగా మార్చి నెలాఖరు నాటికి అంటే.. రెండు రోజుల్లో పూర్తి చేస్తున్నామని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ