
వరంగల్, 31 మార్చి (హి.స.)
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
వాటిని సాదాబైనామాల దరఖాస్తులపై పట్టింపు లేదు. ఏళ్లు గడిచిన వాటి పరిష్కారం లేదు. భూములను కొనుగోలు చేసి పంటలు పండిస్తున్న రైతులు పరిష్కరించాలని ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భూమిపైన ఉన్న తమకు పట్టాలు మంజూరు చేయాలని అధికారులను కోరుతున్నారు. రైతులు ధరణి, భూభారతి, గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్న ఫలితం మాత్రం లేదు. ఇప్పటికీ తహశీల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలకు తిరుగుతూ సమస్యలను పరిష్కరించాలని రైతులు విన్నవిస్తున్నారు. అమ్మినవారి పేర్ల మీదనే భూములు కొనసాగడంతో తమకు రుణాలు, రైతు భరోసా రాక నష్టపోతున్నామని వాపోతున్నారు.
ఉమ్మడి వరంగల్ఆజిల్లాలో సాదాబైనామాల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏళ్ల కింద గ్రామాల్లో పెద్ద మనుషుల మధ్య ఒప్పందం చేసుకొని భూములను కొనుగోలు చేశారు. ఆ భూములకు సంబంధించి కాగితాలను రాసుకున్నారు. ఆ భూముల్లో ఇప్పటికీ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. కొన్ని గ్రామాల పరిధిలో 20-30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూములు ఉండగా, మరికొన్ని గ్రామాల్లో 15 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూములు ఉన్నాయి. గ్రామాల్లో పెద్ద మనుషుల మధ్య ఒప్పందం చేసుకున్న రైతులు ధరణి వచ్చిన తర్వాత భారీగా సమస్యలను ఎదుర్కొన్నారు.
అప్పటి ప్రభుత్వం అక్టోబర్ 2020 లో దరఖాస్తు చేసుకోవాలనడంతో భారీగా రైతులు మీసేవ ద్వారా దరఖాస్తులు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా భూభారతి చట్టం ప్రకారం గ్రామాల్లో సభలు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్ జిల్లాలో 68,482, ములుగులో 34,441, ລ້ລ້ 32,600, ລ້ 51,900, హన్మకొండ 30,371, వరంగల్ 53,400 దరఖాస్తులు రైతుల నుంచి వచ్చాయి. ధరణి హయాంలో కొన్ని భూముల సమస్యలే పరిష్కరించిన వేలాది మంది రైతుల భూ సమస్యలు పరిష్కారం కాలేదు. ధరణి, భూభారతి చట్టాల ప్రకారం 2014 జూన్ కు ముందు కొనుగోలు చేసిన భూములనే సాదాబైనామాల కింద పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు