
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) దేశంలోని గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు రూ. 1,500 కోట్లకు పైగా గ్రాంట్లను విడుదల చేస్తూ కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక స్వపరిపాలనను మెరుగుపరచడమే లక్ష్యంగా గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థలకు ఈ నిధులను కేటాయించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థల కోసం కేంద్రం రూ. 247.94 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇవి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత 'అనీటైడ్ గ్రాంట్స్' ໐ (Untied Grants) రిలీజ్ చేసింది. ఈ నిధుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 12,600 గ్రామ పంచాయతీలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్ణయించిన అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే జీతాలు, కార్యాలయ ఖర్చులకు ఈ వినియోగించరాదు. ఇతర రాష్ట్రాల కేటాయింపులు: నిధులను తెలంగాణతో పాటు రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మిజోరం, మేఘాలయ రాష్ట్రాలకు కూడా నిధులు విడుదలయ్యాయి. ఇందులో రాజస్థాన్కు రూ.315.61 కోట్లు, మహారాష్ట్రకు రూ.800 కోట్లు, ఉత్తరాఖండ్ కు రూ.91.31 కోట్లు, మేఘాలయ: రూ.49.20 కోట్లు విడుదల చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..