
హైదరాబాద్, 05 మార్చి (హి.స.)
మెగా అభిమానులు ఎంతగానో
ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh) బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతోంది. గతంలో ప్రకటించిన విడుదల తేదీ కంటే ముందే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రాన్ని ఉగాది పండుగ సందర్భంగా ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. వాస్తవానికి ఈనెల 26న విడుదల చేయాలని చిత్ర యూనిట్ తొలుత భావించింది. అందుకు తగినట్లుగానే 'ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత' అంటూ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్లో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ సోషల్ మీడియాను సైతం షేక్ చేస్తోంది
కాగా, ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో పవన్ సరసన టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' లాంటి మాస్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉస్తాద్ భగత్ సింగ్కు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయని మూవీ టీమ్ చెబుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతోంది. ఈ ముందస్తు విడుదల నిర్ణయంతో థియేటర్ల వద్ద ఉగాది పండుగ ముందే రానుందని పవర్స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..