పదో తరగతి విద్యార్ధులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.. హాల్ టికెట్ చూపిస్తే చాలు!
రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి మొదలవనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా తాజాగా విడుదలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్ విద్యార్ధులకు తీపి కబురు చెప్పింద
Bus


హైదరాబాద్, 06 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి మొదలవనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా తాజాగా విడుదలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్ విద్యార్ధులకు తీపి కబురు చెప్పింది. SSC పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు SSC పరీక్షల కోసం APSRTC కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పదో తరగతి పరీక్షలకు వెళ్లే విద్యార్థులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది.

విద్యార్ధులు తమ హాల్ టికెట్ చూపించి ఫ్రీ బస్ ట్రావెల్ చేయవచ్చని పేర్కొంది. మార్చి 16 నుంచి పదో తరగతి విద్యార్థులకు APSRTC ఉచిత సౌకర్యం అందుబాటులోకి రానుంది. పరీక్షలు జరిగే ఆయా తేదీల్లో హాల్ టికెట్ చూపిస్తే చాలు విద్యార్ధులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. 10 వ తరగతి పరీక్షా రోజులలో విద్యార్థులకు ఉచిత బస్సు సేవలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీలకు హాజరయ్యే 6.42 లక్షల విద్యార్థులకు APSRTC ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. విద్యార్థుల సౌకర్యార్థం తగిన సంఖ్యలో బస్సులు నడపాలని APSRTC ఆదేశించింది. పరీక్షా రోజుల్లో బస్ పాస్ అడగవద్దని సిబ్బందికి సూచనలు చేసింది. కాగా రాష్ట్రంలోని విద్యార్ధులకు మార్చి 16 నుంచి మార్చి 30వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande