
ముంబై, 06 మార్చి (హి.స.)దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ మార్పులు, మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉన్న భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో ఈ విలువైన లోహాల ధరలు తరచుగా మారుతున్నాయి. తాజాగా ఇవాళ భారత బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కొంత తగ్గగా, వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు నమోదయ్యాయి. హైదరాబాద్ మార్కెట్ను తీసుకుంటే, ఇవాళ 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.1,62,870, 22 క్యారెట్ల ధర రూ.1,49,290 లు ధర పలుకుతోంది.
దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…
– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,64,940 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,51,190 గా ఉంది.
– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,62,870, 22 క్యారెట్ల ధర రూ.1,49,290 గా ఉంది.
– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,63,020 క్యారెట్ల ధర రూ.1,49,440 గా ఉంది.
– కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,62,870, 22 క్యారెట్ల ధర రూ.1,49,290 గా ఉంది.
– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,62,870, 22 క్యారెట్ల ధర రూ.1,49,290 గా ఉంది.
– హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,62,870, 22 క్యారెట్ల ధర రూ.1,49,290 గా ఉంది.
– విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,62,870, 22 క్యారెట్ల ధర రూ.1,49,290 గా ఉంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచ మార్కెట్లో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గుచూపినప్పుడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగితే ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇటీవల గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల తర్వాత ఇప్పుడు కొంత తగ్గుదల కనిపిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV