గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల రక్షణకు చర్యలు.. కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ, 09 మార్చి (హి.స.) పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని కేంద్ర మంత్రి జైశంకర్ అన్నారు. తాజా పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు
Central


న్యూఢిల్లీ, 09 మార్చి (హి.స.)

పశ్చిమాసియాలో పరిస్థితులు

తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని కేంద్ర మంత్రి జైశంకర్ అన్నారు. తాజా పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారతీయుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని, సంబంధిత శాఖలన్నింటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. పశ్చిమాసియాలో పరిస్థిస్తులపై ఇవాళ కేంద్రం రాజ్యసభలో ప్రకటన చేసింది. ఈ సందర్భంగా పెద్దల సభలో మాట్లాడిన మంత్రి జైశంకర్ శాంతికి ఎలాంటి విఘాతం కలిగినా ప్రపంచం మొత్తం ఆ ప్రభావం ఉంటుందని చర్చలు, దౌత్యపరంగా సమస్య పరిష్కారం అవుతుందని భారత్ నమ్ముతోందని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. మార్చి 1న సీసీఎస్ సమావేశం నిర్వహించామన్నారు. ఇరాన్ లోని భారతీయుల భద్రతకు ఎంబసీ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పరిస్థితులు చక్కబడగానే టెహ్రాన్లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని వెల్లడించారు.

ఇంధన ధరల విషయంలో అప్రమత్తంగా ఉన్నాం:

గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టామని కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారని వెల్లడించారు. గల్ఫ్ లో చిక్కుకున్న వారిని భారత్ రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇరాన్ కు వెళ్లొద్దని జనవరిలోనే భారతీయులుక సూచించామన్నారు. భారత్ ఇంధన అవసరాల విషయంలో పశ్చిమాసియా కీలకం. క్రూడాయిల్ ధర పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. గల్ఫ్ దేశాలు భారత్ కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారత ఎంబసీలు ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయన్నారు. గల్ఫ్ దేశాలతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. భారతీయుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు. భారత్ రావాలనుకునేవారి కోసం విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయన్నారు. దోహా, జోర్డాన్ లో ఉన్న వారికి సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడినట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande