ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్. కవిత సహా 23 మందికికి నోటీసులు
న్యూఢిల్లీ, 09 మార్చి (హి.స.) దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజీవాల్, కవిత, మనీశ్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కేసులో ప్రతివాదుల నుంచి సమ
Liquor scam


న్యూఢిల్లీ, 09 మార్చి (హి.స.)

దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజీవాల్, కవిత, మనీశ్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కేసులో ప్రతివాదుల నుంచి సమాధానాలు కోరింది. ఈ కేసులో నిందితులకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థపై తీర్పులోప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం తదుపరి విచారణ చేపట్టనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande