పోలీస్ బాస్ 'సైలెంట్ ఆపరేషన్' సక్సెస్.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ!
హైదరాబాద్, 09 మార్చి (హి.స.) మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించుకునేందుకు తెలంగాణ కూతవేటు దూరంలో ఉన్నది. ఉద్యమాలకు నిలయంగా ఉన్న రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి లేకుండా పోతున్నది. గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 721 మంది మావోయిస్టులు లొంగిప
DGP


హైదరాబాద్, 09 మార్చి (హి.స.)

మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించుకునేందుకు తెలంగాణ కూతవేటు దూరంలో ఉన్నది. ఉద్యమాలకు నిలయంగా ఉన్న రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి లేకుండా పోతున్నది. గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంత భారీ స్థాయిలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడం వెనుక పోలీసు యంత్రాంగంపై వారికి కలిగించిన నమ్మకం, పారదర్శకమైన విధానాలే కారణమనే జరుగుతున్నది. ఇందులో డీజీపీ శివధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. చర్చ

మావోయిస్టుల ఉనికి రాష్ట్రంలో ప్రస్తుతం నామమాత్రంగా ఉన్నది. స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలో కలిసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ఈ అనూహ్య మార్పు వెనుక రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కృషి, పట్టుదల ఉన్నదనే చర్చ జరుగుతున్నది. ఆయన బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. ఇందుకు డీజీపీ అనుసరిస్తున్న నిశ్శబ్ద వ్యూహం, పక్కా ప్రణాళికలే ప్రధాన కారణమని సామాజిక కార్యకర్తలు, మావోయిస్టుల కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. శాంతియుత తెలంగాణ స్వప్నం సాకారానికి ఆయన ఒక నిశ్శబ్ద యోధుడిలా చేస్తున్న కృషి సర్వత్రా ప్రశంసలందుకుంటున్నది.

శాంతిభద్రతల మావోయిస్టుల కదలికలను నిశితంగా గమనించే నిఘా విభాగం (ఎస్ఐబీ)లో గతంలో శివధర్ రెడ్డి ఎస్పీగా పని చేశారు. ఎస్ఐబీ డీఐజీగా పూర్తి కాలం, ఐజీపీగా, అడిషనల్ డీజీపీగా, ప్రస్తుతం డీజీపీగా అటవీ ప్రాంతాల్లోని పరిస్థితులు, మావోయిస్టుల వ్యూహాలపై ఆయనకు పట్టు ఉన్నది. ఇవి ఆయన నిక్కచ్చిగా నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడిందనే చర్చ జరుగుతున్నది. ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, పరిరక్షణలో ఆయన పోషిస్తున్న పాత్ర కీలకం. నల్లగొండ జిల్లా ఎస్పీగా శివధర్ రెడ్డి చేరినప్పుడు నక్సలైట్లు (ప్రస్తుతం మావోయిస్టులు) ప్రజా కోర్టుల పేరుతో శాసిస్తుండేవారు. ప్రధానంగా రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు అనుక్షణం అప్రమత్తతతో ఉండాల్సిన పరిస్థితులు నాడు ఉండేవి. నల్లగొండ జిల్లాలో ఎస్పీగా చేరిన కొద్ది రోజుల వ్యవధిలోనే చిట్యాల ప్రాంతంలోని తాళ్ల వెల్లంలలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మరికొంత కాలానికి మరో రెండు భారీ స్థాయి ఎన్ కౌంటర్లు జరిగాయి. అప్పటినుండి తీవ్రవాద కార్యకలాపాలపై శివధర్ రెడ్డికి పట్టున్నది. ఇప్పుడు మావోయిస్టుల్లో విశ్వాసాన్ని కలిగించి ప్రస్తుతం డీజీపీ కీలకంగా జరుగుతున్న లొంగుబాట్లలో వ్యవహరించారని, మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల్లో ఏ అధికారికీ దక్కని గౌవరం శివధర్ రెడ్డి దక్కిందనే చర్చ జరుగుతున్నది.డీజీపీగా శివధర్ రెడ్డి చూపిన చొరవతోనే కొద్దికాలంలోనే రికార్డు స్థాయిలో లొంగుబాట్లు నమోదయ్యాయి.

నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ (ప్రకటించబడని మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి), మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న, పోతుల పద్మావతి అలియాస్ సుజాతక్క లొంగుబాటులో డీజీపీ కీలకంగా వ్యవహరించారు. స్టేట్ కమిటీ సభ్యులు బడే చొక్కారావు అలియాస్ దామోదర్, బండి ప్రకాశ్, కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, నూనె నర్సింహారెడ్డి వంటి కీలక నేతల లొంగుబాటులో కూడా డీజీపీ కృషి ఉన్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా అధునాతన ఆయుధాలు, ఇజ్రాయెల్ వెపన్ టావోర్ సీక్యూబీ, అమెరికా వెపన్ కోల్ట్ రైఫిల్, హెలికాప్టర్ షాట్స్ ఆయుధాలను రాష్ట్ర పోలీస్ శాఖ స్వాధీనం చేసుకున్నది. 266 ఆధునాతన ఆయుధాలను గడిచిన రెండేళ్ల కాలంలో స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31 గడువులోపు మరికొంత మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తున్నది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande