ఓటీటీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ జాతర.. ఈ వారం స్ట్రీమింగ్కు రానున్న సినిమాలు, సిరీస్లు ఇవే
హైదరాబాద్, 09 మార్చి (హి.స.) ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం పూర్తి స్థాయి వినోదం అందబోతోంది. మార్చి 9 నుంచి మార్చి 15 వరకు పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు, రియాలిటీ షోలు వరుసగా స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. తెలుగు సినిమా
Ott


హైదరాబాద్, 09 మార్చి (హి.స.) ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం పూర్తి

స్థాయి వినోదం అందబోతోంది. మార్చి 9 నుంచి మార్చి 15 వరకు పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు, రియాలిటీ షోలు వరుసగా స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. తెలుగు సినిమాలతో పాటు తమిళం, హిందీ, ఇంగ్లీష్, కొరియన్, గుజరాతీ వంటి పలు భాషల కంటెంట్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్లు, రొమాంటిక్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, యాక్షన్ సినిమాలు ఇలా అన్ని రకాల కథలతో ఈ వారం ఓటీటీలో మంచి కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సినిమాలలో మాస్ మహారాజా రవితేజ నటించిన “భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రత్యేకంగా నిలుస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం మార్చి 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

విశ్వక్ సేన్ హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన “ఫంకీ” సినిమా కూడా ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం మార్చి 13 నుంచి నెటిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా నటించిన నవాబ్ కేఫ్ కూడా ఈ వారం ఓటీటీలోకి రానుంది. మార్చి 12 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన ది తాజ్ స్టోరీ” కూడా ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. తుషార్ అమ్రిష్ గోయల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజ్ మహల్ చరిత్రకు సంబంధించిన వివాదాస్పద అంశాలను ప్రస్తావించడం వల్ల గతంలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ చిత్రం మార్చి 13 నుంచి లయన్సేట్ ప్లేలో హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక తమిళ సినిమా పూకీ మార్చి 13 నుంచి జీ5లో విడుదల కానుంది. ప్రియాంక అరుల్ మోహన్ నటించిన మేడ్ ఇన్ కొరియా చిత్రం మార్చి 12న నెటిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే కన్నడ యాక్షన్ డ్రామా ల్యాండ్గార్డ్ కూడా మార్చి 13 నుంచి జీ5లో అందుబాటులోకి రానుంది. తమిళ సినిమా నాంగల్ సన్ నెక్స్ట్లో విడుదల అవుతుంది. హాలీవుడ్ చిత్రాల్లో “ది మాడిసన్”, “ది ఫ్యామిలీ మెకమ్ములెన్ వంటి సినిమాలు మార్చి 15న జియో హాటార్లో స్ట్రీమింగ్ కానున్నాయి.

సినిమాలతో పాటు ఈ వారం ఓ కొత్త రియాలిటీ షో కూడా ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఈ షో మార్చి 15 నుంచి జియో హాట్గార్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో పది జంటలు ఒకే ఇంట్లో పది వారాల పాటు కలిసి ఉంటూ తమ ప్రేమ, నమ్మకం, సంబంధాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ షోకు దర్శకుడు అనిల్ రావిపూడి, నటి రాధ, లయ జడ్జిలుగా వ్యవహరిస్తుండగా యాంకర్ శ్రీముఖి హోస్ట్గా కనిపించనుంది. వెబ్ సిరీస్ల పరంగా కూడా ఈ వారం మంచి కంటెంట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. “ఆస్పిరెంట్స్ సీజన్ 3 మార్చి 13 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఆంధ్ర ప్యార్ 2.0” అనే హిందీ వెబ్ సిరీస్ మార్చి 14న జీ5లో విడుదల అవుతుంది.నెటిక్స్లో “వన్ పీస్ సీజన్ 2”, “వర్జిన్ రివర్ సీజన్ 7”, ఫాటల్ సెడక్షన్ సీజన్ 3” వంటి సిరీస్లు కూడా ఈ వారం విడుదల కానున్నాయి. ఇలా ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాలతో పాటు పలు భాషల సినిమాలు, వెబ్ సిరీస్లు, రియాలిటీ షోలు విడుదలవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande