
హైదరాబాద్, 09 మార్చి (హి.స.)
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా
గంజాయి పట్టుబడింది. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద తనిఖీల్లో రూ.3 కోట్ల విలువైన 9 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైడ్రోపోనిక్ గంజాయిని సీజ్ చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు ముషీరాబాద్ లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జె.ఆర్.ప్రదీప్ నుంచి విజయ్ కుమార్ హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 367 గ్రాముల హాష్ ఆయిల్, ఒక బైక్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..