కొండగట్టు హనుమాన్ ఆలయంలో అపశృతి
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి నెలకొంది
Hanuman


జగిత్యాల , 01 ఏప్రిల్ (హి.స.)

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి నెలకొంది.

ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లే ఈ దుర్గటన జరిగిందని ఆరోపిస్తున్నారు.

హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హనుమాన్ మాల విరమణ కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు కూడా వేశారు. ఈ క్రమంలో నాసిరకంగా వేయడంతో చలువ పందిరి కూలిపోయిందని భక్తులు ఆరోపిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande