
కొలత్తూరు , 11 ఏప్రిల్ (హి.స.)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని తమ కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కనిపిస్తున్న అఖండ ప్రజాస్పందనే దీనికి కారణమని పేర్కొన్నారు.
ఇంతకు ముందు డీఎంకే నేతృత్వంలోని కూటమి 200 కంటే ఎక్కువ నియోజక వర్గాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేశాం. కానీ ప్రస్తుతం ఉన్న ప్రజామద్దతు, జనసందోహాన్ని చూస్తుంటే, మొత్తం 234 నియోజక వర్గాల్లోనూ మా కూటమి విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా విపక్షాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రతిపక్ష శక్తి కూడా తమను ఓడించలేదని, అందువల్ల ప్రత్యర్థుల గురించి తమ కూటమికి ఎలాంటి ఆందోళన లేదని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi