
కలకత్తా, 11 ఏప్రిల్ (హి.స.)ఈశాన్య రాష్ట్రాల ప్రజల నుంచి ఓట్లను సాధించగలమన్న నమ్మకం కోల్పోయినందునే బీజేపీ అస్సాం ఎన్నికల కోసం వెలుపల నుంచి ప్రజలను తీసుకువచ్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
ఉత్తర 24 పరగణాల జిల్లాలోని తెంతులియా వద్ద ఓ ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కింద దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలు నిష్పాక్షితను కోల్పోయాయని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను బీజేపీ కొనేసిందంటూ ఆమె ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఓ రైలు నిండా 50,000 మందిని అస్సాంకు తీసుకువచ్చారు అని ఆమె ఆరోపించారు. పామునైనా నమ్మొచ్చునేమో కాని బీజేపీని మాత్రం కాదని ఆమె విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi