
హైదరాబాద్, 14 ఏప్రిల్ (హి.స.)మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ నదిపై ఉన్న 15 వంతెనల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు రంగం సిద్ధమైంది. జేఎన్టీయూ హైదరాబాద్ ప్రొఫెసర్ అనిత షీలా, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఏరో ఫోర్జ్ ల్యాబ్ అంకుర సంస్థలు డ్రోన్ల ద్వారా వంతెనల సామర్థ్య పరీక్షలను నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వనున్నారు.
డ్రోన్ సాంకేతికపై పరిశోధనలు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ అనిత షీలా వంతెనల సామర్థ్య పరీక్షలకు డ్రోన్లను వినియోగిస్తే.. మరింత కాలం పరిరక్షించవచ్చని చెబుతున్నారు. పుణెలోని మూలా ముథా నది వంతెన సామర్థ్య పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆమె నివేదిక అందజేశారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులోనూ 15 వంతెనలకు ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రతిపాదించగా.. ఆ డిపార్ట్మెంట్ అధికారులు రూ.1.70 కోట్లు మంజూరు చేశారు.
డ్రోన్లతోనే ఎందుకు?
అమెరికా, ఐరోపా దేశాల్లో డ్రోన్లతో వంతెనల సామర్థ్యాన్ని గంటల వ్యవధిలో చిత్రీకరించి సివిల్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ నిపుణులకు నివేదించి లోపాలను గుర్తిస్తున్నారని ప్రొఫెసర్ అనిత షీలా తెలుసుకున్నారు. వీటి ఆధారంగా చర్యలు చేపడితే నలభై,యాభై సంవత్సరాల వరకూ వంతెనలు నిక్షేపంగా ఉంటాయని ఆ నివేదికల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె పుణెలో వంతెన సామర్థ్యాన్ని పరీక్షించారు. సివిల్ ఇంజినీర్ల బృందం నిర్వహించే సర్వే, కాంక్రీట్ పరీక్షలు, వాటి ఫలితాలకు 15 రోజులు సమయం తీసుకుంటే.. షీలా బృందం రెండురోజుల్లో పూర్తిస్థాయి నివేదిక రూపొందించింది.
డ్రోన్ల ద్వారా వంతెనల సామర్థ్యాన్ని పరీక్షించడమంటే మన శరీరాన్ని ఎక్స్రే తీయడం లాంటిదే. వంతెనలో ఏ భాగాన్ని తాకకుండా అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో డ్రోన్లు ఆపాదమస్తకం చిత్రీకరిస్తాయి. చిత్రాలు, దృశ్యాలతో పాటు వంతెన అంతర్భాగంలో లోపాలను మిషన్ లెర్నింగ్ ద్వారా విశ్లేషించి ప్రాథమిక నివేదిక అందిస్తాయి. మిషన్ లెర్నింగ్, కృత్రిమమేధ సహకారంతో ఒక్కో అంశంపై పూర్తి వివరాలు తెలుస్తాయి. వీటి ఆధారంగా సివిల్, స్ట్రక్చరల్
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్