కేటీఆర్ పై మహేశ్ గౌడ్ ధ్వజం
కేటీఆర్ పై మహేశ్ గౌడ్ ధ్వజం
కేటీఆర్ పై మహేశ్ గౌడ్ ధ్వజం


హైదరాబాద్, 15 ఏప్రిల్ (హి.స.)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై, ఆ పార్టీ అగ్రనేతలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందన ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పదవులు కోల్పోయి విలవిలలాడుతున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేస్తాననడంపై స్పందిస్తూ... ఆయన ఏం చేసినా రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ను క్షమించే పరిస్థితి లేదని అన్నారు. పదేళ్లలో చేసిన అరాచకాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. కేటీఆర్ పాదయాత్రకు వెళ్లే ముందు, తన చెల్లెలు కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. సంతోష్ రావు సంతోషం వెనుక ఉన్న రహస్యం ఏంటి? హరీశ్ రావు ఆనందం వెనుక ఉన్న దోపిడీ ఎంత? అనే విషయాలు కవిత ద్వారానే బయటపడుతున్నాయని సెటైర్లు వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande