
అమరావతి, 17 ఏప్రిల్ (హి.స.)
: మహిళా బిల్లు నేడు లోక్సభలో ఆమోదం పొందనున్న నేపథ్యంలో సంబరాలు నిర్వహించేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళగిరి సీకే కన్వెన్షన్లో కూటమి నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరవుతారు. సమావేశానికి హాజరు కావాలని కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే సమాచారం పంపారు. చంద్రబాబు ఉదయం 11 గంటలకే టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ