
ఆంధ్రప్రదేశ్, 17 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన ఎండలు, వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. గురువారం ఒక్కరోజే నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే మే, జూన్ నెలల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గురువారం రాష్ట్రంలోని 215 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు వేడికి అట్టుడికిపోయాయి. శుక్రవారం కూడా మన్యం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో 43-44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సుమారు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 55 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi