
హైదరాబాద్, 17 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ
(Telangana Registration Department ) పరిధిలోని ఆన్లైన్ సేవలు స్తంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియలు నిలిచిపోయాయి. అధికారిక వెబ్సైట్ పనిచేయకపోవడంతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. భూముల కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్ అపాయింట్మెంట్లు, ఈ-స్టాంప్ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా ముందుగా స్లాట్ బుక్ చేసుకున్నవారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్ డౌన్ అయినట్లు సమాచారం. సమస్యను పరిష్కరించేందుకు Telangana Registration Department సిబ్బంది ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. సేవలు పునరుద్ధరించే వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రజలు అవసరం లేని రద్దీకి వెళ్లకుండా, అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాలని సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు