ఈనెల 19న హిందూ సమ్మేళనం సభ - జయప్రదం చేయాలని కాకతీయ హిల్స్ హిందూ సమ్మేళన ఉత్సవ సమితి పిలుపు
ఈనెల 19న హిందూ సమ్మేళనం సభ - జయప్రదం చేయాలని కాకతీయ హిల్స్ హిందూ సమ్మేళన ఉత్సవ సమితి పిలుపు
pres note


హైదరాబాద్, 17 ఏప్రిల్ (హి.స.)

ప్రగతి నగర్: ఈనెల 19వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రగతినగర్ లోని వాసవి లేఔట్ లోని జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో హిందూ సమ్మేళన సభను నిర్వహిస్తున్నట్లు హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు దొడ్డ పవన్ గారు, కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ భారతీజైన్, ఉప్పాల వంశీగుప్తాగారు, వ్యవస్థా ప్రముఖులు సంతోష్, సాత్విక్ , స్వాగత కమిటీ సభ్యులు నరేంద్ర చౌదరి, నీతా గారు, మరియు కమిటీ సభ్యులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భారత దేశ సంస్కృతి , సంప్రదాయాల పరిరక్షణ తో పాటు హిందూ సమాజ ఐక్యతకు హిందూ సమ్మేళన సమితి కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా ఈనెల 19వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రగతినగర్ లోని వాసవి లేఔట్ లోని జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళన సభకు విద్యారణ్యం వేదపాఠశాల వ్యవస్థాపకులు శ్రీ మాడుగుల శశిభూషణ సోమయాజి గురూజీగారు,ముఖ్య అతిథిగా మరియు ప్రధాన వక్తగా సేవాభారతి తెలంగాణ ప్రాంత సంఘటనా మంత్రి వాసుగారు, డాక్టర్ భువనేశ్వరీ మారేపల్లిగారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సభలో గోపూజ , దేశభక్తి గీతాలు , భరతమాత పూజ ,ధార్మిక ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమాజ ఐక్యతపై సందేశాలు ఉంటాయి అని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జరగనున్న హిందూ సమ్మేళన సభలో హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande