డీలిమిటేషన్తో సౌత్ వాయిస్ తగ్గుతుంది: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
బీజేపీ చేసే డీలిమిటేషన్ వల్ల సౌత్ రాష్ట్రాలకు 66 సీట్లు పెరిగితే - నార్త్ రాష్ట్రాలకు 190 సీట్లు దాటుతున్నాయి
Delimitation-south-news-imp


హైదరాబాద్, 17 ఏప్రిల్ (హి.స.)డీలిమిటేషన్పై కేంద్రం వైఖరి కరెక్ట్ కాదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీట్లు పెరిగితే ప్రస్తుతం నార్త్ రాష్ట్రాలకు - సౌత్ రాష్ట్రాలకు ఉన్న గ్యాప్ డబుల్ అవుతుందని చెప్పారు. సీట్ల పెంపుపై కమిషన్ వేయాలని.. అన్ని రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్పై అఖిలపక్షం పెట్టాలన్నారు. దేశ భక్తితో కూడిన వైఖరి కాదని... దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర ఇది అంటూ మండిపడ్డారు. నార్త్ రాష్ట్రాల బలంతో శాశ్వతంగా కుర్చీలో కూర్చునే కుట్ర ప్రధాని మోదీ చేస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ చేసే డీలిమిటేషన్ వల్ల సౌత్ రాష్ట్రాలకు 66 సీట్లు పెరిగితే - నార్త్ రాష్ట్రాలకు 190 సీట్లు దాటుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. 50 శాతం ప్రకారం సీట్ల పెంపు చేస్తే భవిషత్తులో దక్షిణ రాష్ట్రాల అవసరం లేకుండా పోతుందన్నారు. 1970లో ఇందిరా గాంధీ - వాజ్పేయి హయాంలో ప్రయత్నం చేసి గొడవ వద్దని వదిలేశారని గుర్తుచేశారు. బీజేపీ చేసే డీలిమిటేషన్ వల్ల సౌత్ రాష్ట్రాలు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుందన్నారు. ఇదే పద్ధతి ఉంటే సౌత్ రాష్ట్రాలు కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande