తెలంగాణలో జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన ఎండలు
తెలంగాణలో జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన ఎండలు
తెలంగాణలో జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన ఎండలు


హైదరాబాద్, 15 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణలో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ మధ్యలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం నాటి వాతావరణ శాఖ నివేదికల ప్రకారం నల్గొండ జిల్లా అడవి దేవులపల్లి మండలంలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

జగిత్యాల జిల్లా కోరుట్లలో 43.4 డిగ్రీలు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్లో 43.2 డిగ్రీలు నమోదు కాగా, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు 42.8 డిగ్రీలకు పైగా ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత ప్రారంభమై మధ్యాహ్నానికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. తీవ్రమైన ఎండలకు తోడు ఉక్కపోత కూడా అధికంగా ఉండటంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు.

ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును కూడా దాటవచ్చని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande