రేవంత్ సభను విజయవంతం చేయాలి: శ్రీధర్ బాబు
రేవంత్ సభను విజయవంతం చేయాలి: శ్రీధర్ బాబు
రేవంత్ సభను విజయవంతం చేయాలి: శ్రీధర్ బాబు


హైదరాబాద్, 18 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'రైతు భరోసా' నిధుల విడుదల కార్యక్రమాన్ని చారిత్రాత్మక విజయవంతం చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మంథనిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంథని, రామగిరి, కమాన్పూర్, ముత్తారం, పాలకుర్తి మండలాల కాంగ్రెస్ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం కాటారంలో జరగనున్న ఈ భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని, ఆయనతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వెల్లడించారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, దానికి రైతు భరోసా పథకమే నిదర్శనమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చేలా చూడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా బాధ్యతలను కేటాయించిన ఆయన, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను, పార్టీ శ్రేణులను కోరారు. కాటారం సభ ద్వారా రైతులకు భరోసా కల్పించడమే కాకుండా, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చాటి చెప్పబోతున్నామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande