ప్రధానిపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు: ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ ప్రతినిధి బృందం
ప్రధానిపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు: ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ ప్రతినిధి బృందం
Mallikarjun Kharge


హైదరాబాద్, 22 ఏప్రిల్ (హి.స.)కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం నేడు న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో భారత ఎన్నికల సంఘం (ECI) అధికారులను కలిసింది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ఉగ్రవాది వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు ఈ బృందం వెళ్ళింది. ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (MCC) తీవ్రంగా ఉల్లంఘించాయని, ఖర్గేపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన ప్రచారంపై ఆంక్షలు విధించాలని బిజెపి నేతలు ఈసీని కోరారు. ఈ బృందంలో అర్జున్ రామ్ మేఘవాల్, అరుణ్ సింగ్ కూడా ఉన్నారు. రేపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది

ాగా కకాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన వ్యాఖ్యలపై స్పందిస్తూ, తాను ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా ఉగ్రవాది అని అనలేదని వివరణ ఇచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ (ED), సీబీఐ (CBI), మరియు ఆదాయపు పన్ను (I-T) శాఖలను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను, ప్రజలను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందనే అర్థంలో టెర్రరైజింగ్ (terrorising) అనే పదాన్ని వాడానని ఆయన స్పష్టం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande