
న్యూఢిల్లీ, 22 ఏప్రిల్ (హి.స.)కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు న్యూఢిల్లీలో జరిగిన సేవ్ ది ఎర్త్ కాన్క్లేవ్ 2026లో ప్రసంగిస్తూ పర్యావరణ పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో పర్యావరణ సమతుల్యత అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వెదురు (Bamboo) సాగు ప్రాధాన్యతను వివరిస్తూ, పారిశ్రామిక రంగంలో దీని వినియోగం ద్వారా పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా గ్రామీణ ఉపాధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ 'వ్యర్థాల నుండి సంపద' (Waste to Wealth) సృష్టించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ICFA) ఆధ్వర్యంలో కాన్సిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల నిపుణులు, విధానకర్తలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi