ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
summer-vacations-for-schools-from-april-24-government-issues-key-alert-to-parents-542913


అమరావతి, 22 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియనుండటంతో, తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. తీవ్రమవుతున్న ఎండల దృష్ట్యా తల్లిదండ్రులకు ప్రభుత్వం పలు జాగ్రత్తలు సూచించింది.

ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో పిల్లలను ఎండలోకి పంపవద్దని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. పిల్లలు ఈత కోసం బావులు, చెరువులు, కాలువలు వంటి నీటి ప్రాంతాలకు వెళ్ళకుండా పర్యవేక్షించాలని హెచ్చరించింది. సెలవుల్లో పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande