
తిరుమల , 22 ఏప్రిల్ (హి.స.)
శ్రీవారి క్షేత్రంలో భక్తుల సందడి ఈ రోజు కూడా కొనసాగుతోంది. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో పాటు విద్యా సంవత్సరం పూర్తవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో తిరుమల కొండపై రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 6 గంటల సమయం పడుతోంది.
మంగళవారం (ఏప్రిల్ 21) ఒక్కరోజే మొత్తం 73,324 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుని 22,955 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ద్వారా లభించిన నగదు ఆదాయం రూ. 3.89 కోట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV