టీటీడీకి ఎలక్ట్రిక్ వాహనం విరాళం
టీటీడీకి ఎలక్ట్రిక్ వాహనం విరాళం
/two-wheeler-donated-to-ttd


తిరుమల, 22 ఏప్రిల్ (హి.స.)

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు ఓ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం విరాళంగా అందింది. తిరుపతికి చెందిన వీఎన్ మొబైల్స్ సంస్థ ఈ వాహనాన్ని అందజేసింది. దీని విలువ సుమారు రూ.95 వేలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదుట ఈ కార్యక్రమం జరిగింది. వీఎన్ మొబైల్స్ సంస్థ వ్యవస్థాపకులైన అప్పల నాయుడు, వెంకట రమణ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఫ్రాన్క్లిన్ ఈవీ బైక్ తాళాలను టీటీడీ సూపరింటెండెంట్ శ్రీనివాసులుకు అందజేశారు. టీటీడీ అవసరాల నిమిత్తం ఈ వాహనాన్ని ఉపయోగించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande