
తెలంగాణ, 28 ఏప్రిల్ (హి.స.)
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 వ తేదీన డిమాండ్ ను మించి పెట్రోల్, డీజిల్ లను 29,939 కిలో లీటర్లు సరఫరా చేసినట్లు వివరించారు. రెండు రోజుల క్రితం వరకు సగటున రోజుకు 5,883 కిలో లీటర్లు పెట్రోల్, 7,348 కిలో లీటర్లు డీజిల్ కు డిమాండ్ ఉండేదని ఆయన తెలిపారు. కానీ 27 వ తేదీన 11,490 కిలో లీటర్లు పెట్రోల్, 18,449 కిలో లీటర్లు డీజిల్ ను వాహనదారులకు సరఫరా చేసినట్లు తెలిపారు. సరఫరాను క్షేత్ర స్థాయి అధికారులు, పెట్రోల్ కంపెనీల ప్రతినిధులతో రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అపోహలతో పెట్రోల్, డీజిల్ ను నిల్వ చేసుకోవద్దని వినియోగదారులకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..